హైదరాబాద్ : ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కార్తీకదీపం సీరియల్ నటి అర్చన అనంత్(సౌందర్య) అన్నారు. గ్రీన్ఇండియా చాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో తన తండ్రి కన్నడ నటుడు అనంత వేలుతో కలిసి ఆమె మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా అర్చన అనంత్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా తన తండ్రితో కలిసి మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని, ఇంత మంచి అవకాశం కల్పించినందుకు ఎంపీ సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం నటుడు అనంత వేలు మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. భూమాతకు ఆభరణం పచ్చదనం అని, ప్రతి ఒక్కరు వీలైనన్ని మొక్కలు నాటి పచ్చదనంతో నింపాలని కోరారు.