జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లిలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలు పోసి రోజులు గడుస్తున్నా కాంటా పెట్టకపోవడంతో వర్షాలకు మొలకలు వచ్చాయి. కొందరు మొలకలు వేరు చేసి ఆరబెట్టగా, మరికొందరు ఇలా మూగజీవాలకు మేతగా వదిలేశారు.
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.