Ethanol Factory | మంచిర్యాల, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పోలీసులు నిర్బంధం విధించినా.. నిరసన తెలుపుతున్నారని కేసులు పెట్టి వేధించినా.. అర్ధరాత్రి ఇండ్లలోకి చొరబడి అరెస్టులు చేసినా.. రైతులు, ప్రజలు వెనక్కి తగ్గలేదు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కదం తొక్కారు. రెండు రోజులపాటు ఉద్రిక్తంగా సాగిన పోరాటంలో చివరకు ప్రజలే గెలిచారు. ప్రజా ఉద్యమానికి దిగివచ్చిన ప్రభుత్వం.. ఫ్యాక్టరీ నిర్మాణ పనులు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ‘ఇథనాల్ ఫ్యాక్టరీ పెడితే వ్యవసాయాన్ని నమ్ముకున్న మేము బతుకుడు కష్టమైతది.. పరిశ్రమ చుట్టూ ఉన్న భూముల్లో ఏడాదికి మూడు పంటలు వేసేటోళ్లం.. ఒక్క పంట కూడా తీయలేక ఆగమైపో తం. మా భూములు, నీళ్లు, గాలి అన్నీ కలుషితమైపోయి.. భూములు పడా వు పడి రోడ్డు మీద పడాల్సి వస్తది. అందుకే మాకు ఇథనాల్ పరిశ్రమ వద్దు’ అంటూ ఏడాది నుంచి దిలావర్పూర్, గుండంపల్లి, బన్సపల్లి, స ముందర్పల్లి గ్రామాల రైతులు, ప్రజ లు పోరాటాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పనులు వేగవంతం కావడంతో ఆందోళన చెందిన రైతులు, స్థానికులు ఈ ఏడాది జనవరి 3న ప్యాక్టరీని ముట్టడించారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడం, యాజమాన్యం పనులు చేసుకుంటూపోవడంతో 4 నెలల నుంచి పోరాటాన్ని తీవ్రతరం చేశారు. దిలావర్పూర్కు చెందిన యువకులు 127 రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. చుట్టు పక్కల గ్రామాల్లోనూ టెంట్లు వేసి నిరసన తెలుపుతున్నారు.
కేసులు పెట్టి వేధింపులు..
ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపుతూ దీక్షల్లో కూర్చు న్న వారిపై 307 కేసులు నమోదు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని నిర్మల్‌లోని బావులవాడ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్‌కుమార్‌ను సస్పెండ్ చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకించిన వారి పై కేసులు తప్పవని భయభ్రాంతుల కు గురిచేశారు. ఏంచేసినా ప్రభుత్వం తిరిగి తమపైనే కేసులు పెడుతున్నదని నాలుగు గ్రామాల రైతులు, ప్రజలు మంగళవారం ఉదయం నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు రాస్తారోకో చేశారు. చర్చలు జరిపేందుకు వచ్చిన ఆర్డీవో రత్న కళ్యాణిని నిర్బంధించారు. దీంతో దిలావర్పూర్ ఆందోళన మరో లగచర్లను తలపించింది. ఏడాది కాలంగా ప్రశాంతంగా సాగిన పోరాటం ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చింది. ప్రజలు ఆందోళన విరమిం చే అవకాశం లేకపోవడంతో ప్రభు త్వం దిగివచ్చింది. కలెక్టర్ అభిలాష అభినవ్ ఫ్యాక్టరీ పనులను నిలిపివేస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. దీంతో తాత్కాలికంగా నిరసనను విరమిస్తున్నట్టు ప్రజలు తెలిపారు. టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నా రు. ఎస్పీ జానకీ షర్మిలను జాతీయ రహదారి నుంచి దిలావర్పూర్ గ్రామంలోనికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం ఎస్పీ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కతో ఆయా గ్రామాల ప్రజలతో ఫోన్లో మాట్లాడించారు.