హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు తన దృష్టికి రావడంతో సీఎం స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. రైతులను ఇబ్బందిపెట్టే వ్యాపారులపై అవసరమైతే ఎస్సెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్(ఎస్మా) కింద చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడటం, రైతులను గందరగోళానికి గురి చేయడం, రైతులను వేధించటం లాంటి సంఘటనలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.