హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: సీఎం రేవంత్‌రెడ్డి పాలన చేతగాక అసహనంతో బెదిరింపులకు దిగుతున్నారని, అశాంతిని రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నారని, సీఎంలా కాకుండా ము ఠా నేతలా వ్యవహరిస్తున్నారని, కేటీఆర్, హరీశ్‌రావులను బెదిరిస్తూ హింసను ప్రేరేపిస్తున్నారని, ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎ ర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ‘వీపు చింతపండు చేస్తా..బుల్డోజర్లు ఎక్కించి తొక్కుతా’ అంటూ ఆటవిక భా ష మాట్లాడడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.
ఆయన వైఖరితో కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయే ప్రమాదం ఉన్నదన్నారు. ఖమ్మంలో హరీశ్‌రావుపై, ముషీరాబాద్‌లో కేటీఆర్‌పై, కొండాపూర్‌లో పాడి కౌశిక్‌రెడ్డిపై జరిగిన దాడులే ఇందుకు నిదర్శనమని చెప్పా రు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినా పోలీసులు కేసు న మోదు చేస్తున్నారని, రాష్ట్రంలో హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డిపై క్రిమిన ల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో మాజీ ఎమ్మెల్యే నో ముల భగత్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు గెల్లు శ్రీనివాస్, రాజీవ్‌సాగర్, రామచంద్రనాయ క్, ఇంతియాజ్, రాకేశ్‌కుమార్, మన్నె గోవర్ధన్‌రెడ్డి, దూదిమెట్ల బాలరాజు, కిశోర్‌గౌడ్, తుంగబాలు, విజయ్‌కుమార్, రంగినేని అభిలాష్, రాంచందర్ తదితరులున్నారు.