హైదరాబాద్, అక్టోబరు 5 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణ అమలయ్యేదాకా డీఎస్సీ నియామకాలను నిలిపివేయాలని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరీణపై సు ప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చి నా అమలును అడ్డుకుంటున్నది ఎవరు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తీర్పు అమలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. సుప్రీంతీర్పును వెంటనే అమలు చేస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించి కూడా రెండు నెలలవుతున్నా, మళ్లీ కమిటీలంటూ సాగదీస్తున్నారని ఆగ్ర హం వ్యక్తంచేశారు. వర్గీకరణపై ఎవరి ప్రయోజనాలు, ప్రలోభాలకు లోంగుతున్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏంచేస్తున్నారని, ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి చేయడంలేదని ప్రశ్నించారు.
ఎస్సీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయడంలేదని విమర్శించా రు. ఎస్సీలకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10 లక్షల దళితబంధు ఇచ్చిందని, వైన్‌షాపు టెండర్లలో 10 శాతం రిజర్వేషన్ కల్పించిందని, నీటిపారుదల శాఖ టెండర్లలో కోటి వరకు ఈఎండీ లేకుండా 21 శాతం టెండర్లు ఇచ్చేలా ఉత్తర్వులు ఇచ్చి అమలు చేసిందని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతు బొమ్మెర రామ్మూర్తి, చందు, అంజన్న, రవి, రజనీ పాల్గొన్నారు.