హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఎర్రగడ్డ బహలూల్ ఖానాగూడ (ఎర్రగడ్డ దవాఖాన) పరిధిలోని సర్వే నంబర్లలో ఉన్న 1.31 ఎకరాల భూమితోపాటు మరో 1.20 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది.
ఈ భూమిని ప్రభుత్వం లీజుకు తీసుకున్నదని, దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని కింది కోర్టులు జారీచేసిన డిక్రీలను రద్దు చేసింది.