హనుమకొండ, అక్టోబర్ 10: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తారనే భయంతోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంటూ కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి డ్రామాలు ఆడారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. శుక్రవారం హ నుమకొండ రాంనగర్‌లోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ఒడితెల సతీశ్‌కుమార్, బానోత్ శంకర్‌నాయక్‌తో కలిసి ఎర్రబెల్లి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రు గ్యారెంటీలు, 420 హామీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో ఒక్కో ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు రూ.2 లక్షలు బాకీ పడిందని మండిపడ్డారు. సీఎంకు పరిపాలనపై అవగాహన లేకపోవడంతోనే రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఎద్దేవా చేశారు.
స్థానిక ఎన్నికల్లో వ్యతిరేకతను తప్పించుకునేందుకు బీసీల రిజర్వేషన్ల అంశం తెరపైకి తెచ్చి డ్రామాలాడుతున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. బీసీల రిజర్వేషన్లపై ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో కొట్లాడితే కలిసి వస్తామని స్పష్టం చేశా రు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని మరిచి ఉద్యమనేత కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను తిట్టడం, దేవుళ్లపై ఒట్టు పెట్టడం, అబద్దాలు ఆడటాన్ని సీఎం పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే తా టికొండ రాజయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు రోజుకో మాట మాట్లాడుతూ బీసీలను మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేతలను కూడా సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని, బడేబాయి మో దీని ఎక్కువసార్లు కలిసిందిక కూడా సీఎం రేవంత్‌రెడ్డేనని పేర్కొన్నారు. మాజీ కార్పొరేటర్లు చింతల యాదగిరి, జోరిక రమేశ్ పాల్గొన్నారు.