తొర్రూరు, ఫిబ్రవరి 8 : దేశంలో కాంగ్రెస్ పని ఖతమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మొన్న మహారాష్ట్ర, ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ను ప్రజలు పట్టించుకోలేదని తెలిపారు. తెలంగాణలో స్థానిక సం స్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు ప్రజలు గుణపా ఠం చెబుతారని జోస్యం చెప్పారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని బీఆర్ఎస్ కా ర్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆ యన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ హ యాంలో దరఖాస్తులు లేకుండా పథకాలను అమలు చేశామని, కానీ, ఇప్పుడు ప్రతి పథకానికి మీసేవలో దరఖాస్తుల పేరిట గందరగోళంలో పడేస్తున్నారని మండిపడ్డారు.