తొర్రూరు, ఆగస్టు 22: నూరుశాతం రు ణమాఫీ పేరున రైతు నెత్తిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శఠగోపం పెట్టారని, మాజీ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. తొర్రూరులో నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడుతూ.. అర్హులైన వారందరికి పూర్తిస్థాయిలో రుణమాఫీ వర్తింపచేసే వరకు రైతుల వెంట నిలిచి పోరాటం చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్‌కు ఓటు వేసిన వారే రుణమాఫీ విషయంలో ఆందోళన చేస్తున్నారని, పూర్తి స్థాయిలో రుణాన్ని మాఫీ చేసే వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. రుణమాఫీపై సీఎంతోపాటు మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పటోళ్ల కార్తీక్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. ఏ ఒక్క హామీని సరిగ్గా అమలు చేయలేని కాంగ్రెస్ సర్కార్ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రభుత్వంలో రైతులు ఎంత మోసపోయారో అందరికి బాగా తెలుసని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో జనాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముతలేరని భావించిన ముఖ్యమంత్రి దేవుళ్ల మీద ఒట్లు వేసి ఆగస్టు 15వరకు రుణమాఫీ చేస్తానని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.