జిల్లా ఏర్పాటుతోనే మహబూబాబాద్ అభివృద్ధి
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేపట్టిన జిల్లాల పునర్విభజనతోనే మహబూబాబాద్ జిల్లా అభివృద్ధి చెందిందని మాజీ మంత్రులు ఎర్రబెల్లి ద యాకర్‌రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. మహబుబాబాద్ జిల్లా ఏర్పడి పదేండ్లు అవుతున్న సందర్భంగా కేసీఆర్‌కు కృతజ్ఞతగా శనివారం మహబూబాబాద్ కలెక్టరే ట్ ఎదుట ఆయన చిత్రపటానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ శంకర్‌నాయక్, డీఎస్ రెడ్యానాయక్, జడ్పీ మాజీ చైర్పర్సన్ అంగోత్ బిందుతో కలిసి క్షీరాభిషేకం చేశారు.
- మాజీ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి
- కలెక్టరేట్ ఎదుట కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
మహబుబాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేపట్టిన జిల్లాల పునర్విభజనతోనే మహబూబాబాద్ జిల్లా అభివృద్ధి చెందిందని మాజీ మంత్రులు ఎర్రబెల్లి ద యాకర్‌రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. మహబుబాబాద్ జిల్లా ఏర్పడి పదేండ్లు అవుతున్న సందర్భంగా కేసీఆర్‌కు కృతజ్ఞతగా శనివారం మహబూబాబాద్ కలెక్టరే ట్ ఎదుట ఆయన చిత్రపటానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ శంకర్‌నాయక్, డీఎస్ రెడ్యానాయక్, జడ్పీ మాజీ చైర్పర్సన్ అంగోత్ బిందుతో కలిసి క్షీరాభిషేకం చేశారు. తొలుత కోర్టు సెంటర్లోని అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు.
అనంతరం బైక్ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి, సత్యవతి మాట్లాడుతూ.. మారుమూల గ్రామాలు, గిరిజన తండాలు అత్యధికంగా ఉన్న మహబూబాబాద్‌ను జిల్లా చేయడంతో అభివృద్ధి వేగవంతమైనదని పేర్కొన్నారు. విశాలమైన రహదారులు, మౌలిక సదుపాయలు క ల్పించడంతో మహబూబాబాద్ జిల్లా రూ పులేఖలు మారిపోయాయని హర్షం వ్యక్తంచేశారు. గతంలో సాగు నీరు, విద్యుత్తు సరఫరా లేక రైతులు ఇబ్బందులు పడేవారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మహబూబాబాద్‌ను సస్యశ్యామ లం చేసిన ఘనత కేసీఆర్‌దేనని వెల్లడించా రు. జిల్లా ఏర్పాటు చేసిన కేసీఆర్‌కు ఇక్కడి ప్రజలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

