హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్కు ప్రపంచ పర్యావరణవేత్త ఎరిక్ సోలిమ్ ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. రోడ్ల జంక్షన్ల వద్ద పచ్చదనం పెంపొందించడం తేలికైన పని కాదు అని ఆయన పేర్కొన్నారు. కానీ అది తెలంగాణలో సాధ్యమైందని తెలిపారు. అన్ని ఇంటర్ జంక్షన్లతో పాటు రోడ్డు మధ్యలో ఉండే డివైడర్లు, రోడ్డుకిరువైపులా పచ్చదనం ఉట్టిపడుతోందని ప్రశంసిస్తూ ఎరిక్ సోలిన్ ట్వీట్ చేశారు.
Making motorway intersections green is no simple task.
— Erik Solheim (@ErikSolheim) September 29, 2021
An intensive green drive has been taken up in Telengana, India 🇮🇳including all intersections, median & sideways ☘️🌿
Well done @KTRTRS & @TelanganaCMO pic.twitter.com/svdvYnKYYA