హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసిన ట్యూషన్ ఫీజులు, స్కాలర్షిప్పులను దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘గుడ్ షెపర్డ్’పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝళిపించింది.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆ విద్యాసంస్థల యాజమాన్యానికి చెందిన 12 స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ప్రస్తుతం మార్కెట్ లెక్కల ప్రకారం ఈ ఆస్తుల విలువ రూ.15 కోట్లు ఉంటుందని అంచనా.