కొత్తగూడెం ప్రగతి మైదాన్, నవంబర్ 11: మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన భీకర పోరులో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.