నల్లగొండ ప్రతినిధి, జూన్ 28 (నమస్తే తెలంగాణ): తన హోదా, స్థాయిని మరచి సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటిలాగే మరోసారి నల్లగొండ వేదికపై నోరుపారేసుకున్నారు. రాష్ట్రంతోపాటు నల్లగొండ జిల్లాకు ఈ రెండున్నరేండ్లలో చేసిందేమీ లేకపోవడంతో ఎప్పటిలాగే ఊకదంపుడు మాట లు.. అడ్డగోలు ప్రేలాపనలతో ప్రసంగాన్ని కొనసాగించారు. సీఎం ప్రసంగంలో పస లేకపోవడంతో సభకు వచ్చిన జనం, ము ఖ్యంగా మహిళలు మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. రేవంత్‌రెడ్డి ప్రసంగం సగం వచ్చేసరికే దాదాపు సభా ప్రాంగణం ఖాళీ అయ్యింది.
అయినా సరే ఖాళీ కుర్చీలకు తన ప్రసంగాన్ని కొనసాగించడం విశేషం. ప్రభుత్వం చేపట్టే అనేక పథకాలకు బీఆర్ఎస్ నేతలు అడ్డొస్తున్నారంటూ పునరుద్ఘాటించారు. మూసీ ప్రక్షాళన అనేది తనకు జీవిత లక్ష్యమంటూ దానికి అడ్డుపడితే అందులో వేసి తొక్కుతానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘మూసీ కంపు, కాలుష్యం నుంచి నల్లగొండ బిడ్డలకు విముక్తి కల్పించాలి. ఆ బాధ్యత నాది. ఒట్టేసి చెప్తున్నా.. ఎవ్వడు వచ్చినా, ఎవ్వడు అడ్డుపడ్డా, ఎవ్వడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీలో వేసి తొక్కుతా.. ప్రక్షాళన చేస్తా’నని హెచ్చరించారు. ‘దేశాన్ని చూడటానికి ఎవరు వచ్చినా మూసీ నది ప్రక్షాళన చూడటానికే రావాలి. దేశానికే తలమానికంగా మూసీ నది ప్రక్షాళన చేస్తా’నని చెప్పుకొచ్చారు.
గతంలో అనేక సందర్భాల్లో శాసనసభ సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తోకముడిచిన సీఎం రేవంత్‌రెడ్డి ఈ సారి ప్రత్యేక సమావేశాల్లో చ ర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసరడం చర్చనీయాంశమైంది. శాసనసభ, శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యులు, ముఖ్యం గా కేటీఆర్, హరీశ్‌రావును ఎదుర్కోలేకపోయారు. కానీ రేవంత్‌రెడ్డి తాజాగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు ఎవ రు అడిగినా.. ప్రత్యేక శాసనసభ, మండలి సమావేశాలను ఏర్పాటు చేస్తామని అ న్నా రు. పదేండ్ల బీఆర్ఎస్, పన్నెండేండ్ల మోదీ పాలన, రెండున్నరేండ్ల కాంగ్రెస్ పా లనపై చర్చకు సిద్ధం కావాలని చెప్పారు. ఎన్నికల మ్యానిఫెస్టోలపై ప్రత్యేక సమావేశాల్లో చర్చిద్దాం.. మీరు సిద్ధమా? సిద్ధమైతే అ సెంబ్లీ స్పీకర్‌కు, కౌన్సిల్ చైర్మన్‌కు లేఖలు రాయాలి. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఎవరు ఏమి చేశారో తేల్చుకుందాం’ అంటూ సవాల్ చేయడం గమనార్హం.
బీఆర్ఎస్ రావాలని ప్రజలెవరూ కోరుకోవడం లేదని, ప్రజాపాలన చూసి అసూయపడే వాళ్లే కోరుకుంటున్నారంటూ రే వంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. కేటీఆర్, హరీశ్‌రావును తోడేళ్లతో పోలుస్తూ తెలంగాణపై పడి తిరుగుతున్నారంటూ అడ్డగోలుగా మాట్లాడారు. వీళ్లకు భవిష్యత్తులో పదవే ఉండదని, బీఆర్ఎస్ గురించి మాట్లాడుకోవాలంటే ఇక గతం గురించే మాట్లాడుకోవాలి తప్ప భవిష్యత్తు లేదని అన్నారు. ఇక బాడీ షేమింగ్ మాటలతో మరోసారి తన నోటికంపును బయట పెట్టుకున్నాడు. ‘తులసీ వనంలో గంజాయి మొక్కలాగా సూ ర్యాపేటలో ఒక్కడు మిగిలిండు.. మా వెం కన్న మీద మూడడుగులు ఎగురుతుండు.. మరోసారి ఆయన సంగతి చూసుకుంటం’ అంటూ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిపై అడ్డగోలు కామెంట్స్ చేశారు.
జిల్లా మంత్రులు తమ నియోజకవర్గాలకే పనులు చేసుకుంటున్నారని ఎంపీ రఘువీర్ ఆరోపించారు. ఇతర చిన్న ని యోజకవర్గాలపై కూడా మంత్రులు శ్రద్ధ తీసుకోవాలి’ అని చురకలు అంటించారు.