తలుపునకు గొళ్ళెం వేయలేదు
తలపులకు తలుపులకు గొళ్ళెం వేయలేదు దాపురించినోడు దొంగ కాదన్న నమ్మకంతోనే నమ్మకాన్ని దేవులాడుకుని..పెయ్యికి కట్టి ఎద యాదిని గడపకే కాపలాగా పెట్టుకున్నం
తలపులకు తలుపులకు గొళ్ళెం వేయలేదు
దాపురించినోడు దొంగ కాదన్న నమ్మకంతోనే
నమ్మకాన్ని దేవులాడుకుని..పెయ్యికి కట్టి
ఎద యాదిని గడపకే కాపలాగా పెట్టుకున్నం
ఆకిట్ల కునుకే…ఊరి నమ్మకం మాకు
అరుగుల ముచ్చటే ఇంటి ఊపిరి
సంత…సిన్త…సద్ది రోళ్ళ మధ్య
బతుకే పల్లె పాటై పలుకుతూ పోతది
గొంగడి కప్పుకున్న గుండెల్లో గుబులు లేదు
మోదుగాకు రంగు మమతల మడతలుండేవి
కడుపు గాలినా గమ్మునుండేటోళ్ళం
ఇయ్యాలనే చేయి వెనక్కి పోలేదు గానీ…
పలుగురాళ్ల కష్టం పంచుకునే బ్రతుకు సప్పుడే మాది..
సోపతులే ఊరి సంపదై తిరిగినం
గొర్రెపిల్ల అమాయక చూపుల్లో….
గరికపూల పరిమళం నవ్వేది మాకాడనే ..
అప్పుడప్పుడు చౌరస్తా కూడలే చెలిమి గూడు
తొవ్వలన్నీ మనుషుల దారులే.. అయ్యేటివి
కండ్లల్ల మెలికలు మొలవటం తెల్వదు మాకు
నమ్మకాలే వెలుగులయ్యే ఊసుల బంధం అది
ఇయ్యాల దర్వాజలకు గొళ్ళాలు ఎక్కువైనాయి
గుండె గదులకు గోడలెక్కువ అయినాయి
నోట్ల కట్టలు పెరిగినకొద్దీ..మనిషిలో
నోటి పలకరింపు పలచబడి పోయింది
ఇంటిసోయి మసకబారి దేహం దేశదిమ్మరైంది
ఇగురం ఇసుమంతైనా నిల్వక నీళ్లపాలైంది
ఊరు రాక పోకలకు దగ్గరైపోయినా….
మనసులు సూత్తాంటనే మైళ్ల దూరమయ్యాయి
గొళ్ళెం వేసుకోలేని కుళ్ళం కుళ్ళం మనసోళ్ళం
లోపలంతా కువారం పెట్టుకుని కుత కుత ఉడకం
ఫాయిదాల కోసం మాటల్ని మర్లేసుకుని బ్రతకం
గుండెకు గొళ్ళెం వేసి…మనుషుల్ని పోగొట్టుకోలేం !
డా.కటుకోఝ్వల రమేష్
9949083327
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

