హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ ఉద్యోగులకు పేస్కేల్ వర్తింపజేయాలని ఏపీవోల సంఘం నేతలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కోరారు. ఈ మేరకు శుక్రవారం మంత్రుల నివాసంలో ఆయనకు వినతిపత్రం అందజేశారు.
చాలీచాలని వేతనాలతో ఉద్యోగులు పనిచేస్తున్నారని వారు మంత్రికి తెలిపారు. ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే రాష్ర్టాన్ని నెంబర్‌వన్‌గా నిలుపడంలో ఉద్యోగుల కృషి ఉందని తెలిపారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజిరెడ్డి, నాయకులు గురుపాదం, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.