హైదరాబాద్, ఫిబ్రవరి12 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల విధుల నుంచి దివ్యాంగ ఉద్యోగులను మినహాయించాలని తెలంగాణ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది.
ఈ మేరకు బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఎన్నికల విధులు నిర్వహించే సామర్థ్యం లేని దివ్యాంగ ఉద్యోగులను మినహాయించాలని విన్నవించింది.