Telangana | హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆర్థిక సంక్షోభంలో కూరుకున్నది. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడానికీ కార్పొరేషన్ మల్లగుల్లాలు పడుతున్నది. ప్రభుత్వం నుంచి రూ.400 కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నదని అధికారులు చెప్తున్నారు. బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరితే గ్యారెంటీతో బ్యాంకు రుణం ఇప్పించిందని తెలిపారు. ఆ అప్పుపై నెలకు రూ.3 కోట్లకు పైగా వడ్డీ చెల్లించాల్సి వస్తున్నదని తెలిపారు.
కార్పొరేషన్ ఆర్థిక పతనంతో టెండర్లు వేయడానికీ కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదని ఉద్యోగులు చెప్తున్నారు. కార్పొరేషన్లో జీతాలు నెలాఖరులోనో, మరో నెలలోనో అం దుతున్నాయని తెలిపారు. సంస్థ మనుగడ సాగించాలంటే బ్యాంకు రుణాన్ని ప్రభుత్వమే చెల్లించి, ఇన్నాళ్లు వడ్డీ కింద బ్యాంకుకు కార్పొరేషన్ చెల్లించిన మొత్తాన్ని ప్రభుత్వం ఇవ్వాలని, ప్రభు త్వ ఖాతా నుంచి ఉద్యోగుల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.