శేరిలింగంపల్లి : తమ స్థలాలు తమకు దక్కేవరకు పోరాటాన్ని ఆపేది లేదని భాగ్యనగర్ నాన్‌గెజిటెడ్
ఆఫీసర్స్(గచ్చిబౌలి) కో-ఆపరేటివ్ మ్యుచువల్లీ ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణగౌడ్ తేల్చిచెప్పారు. గోపన్‌పల్లిలో బీటీఎన్జీవోల ఆందోళనలో భాగంగా మంగళవారం 28వ రోజు ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు.
సొసైటీ కార్యాలయం నుంచి ప్రధాన రహదారి వరకు ర్యాలీ కొనసాగింది. వీరికి టీఎన్జీవో మార్కెట్ కమిటీ మద్దతు ప్రకటించింది.