Home
Telangana
Employees Have Not Received Their Salaries As They Are Told That They Will Be Paid On One Date Every Month
జీతాలు జమ కాలే.. పింఛన్లు పడలే!
ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలిస్తామని ఎన్నికల్లో హామీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దానిని నిలబెట్టుకోవడంలో విఫలమైంది.
- హామీ నిలబెట్టుకోలేకపోయిన సర్కారు
- ఐదో తేదీ దాటినా పడని వేతనాలు
- ఎదురుచూస్తున్న ఉద్యోగులు
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలిస్తామని ఎన్నికల్లో హామీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దానిని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ఐదో తేదీ దాటినా చాలా సబ్ ట్రెజరీల్లో ఇప్పటి వరకు టీచర్లు, ఉద్యోగులకు వేతనాలు అందలేదు. ఒకటో తేదీన కొందరికి వేతనాలు వేసిన ప్రభుత్వం అందరికీ ఇచ్చినట్టు చెప్పుకున్నది. వాస్తవానికి ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో వేతనాలు జమకాలేదు. పింఛన్లు కూడా పడకపోవడంతో లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నారు. వేతనాల విషయంలో ప్రభుత్వం పక్కా వ్యూహంతో వెళ్తున్నట్టు అర్థమవుతున్నది. ఒక జిల్లాలో మూడు, నాలుగు సబ్ ట్రెజరీలుంటే ఒక ట్రెజరీలో జమచేసి జిల్లా అంతా ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటూ మిగతా ట్రెజరీల్లో వేతనాలు ఆలస్యంగా జమచేస్తున్నది.
వాస్తవ పరిస్థితి ఇలా
- సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్, గజ్వేల్ ఎస్టీవోలు మినహా సిద్దిపేట, తొగుట, దుబ్బాక, చేర్యాల ప్రాంత ఉద్యోగులు, టీచర్లకు ఇప్పటివరకు జీతాలు జమకాలేదు.
- జగిత్యాల జిల్లాలో మూడు ఎస్టీవోలుంటే మెట్పల్లి సబ్‌ట్రెజరీ పరిధిలో మాత్రమే జీతాలు జమయ్యాయి. మిగతా రెండు ట్రెజరీల్లో జీతాలు జమకాలేదు.
- ఖమ్మం జిల్లాలోని వైరా ఎస్టీవో పరిధిలోని ప్రభుత్వ లెక్చకర్లు, ఉద్యోగులకు ఇప్పటికీ వేతనాలు అందలేదు.
- కేజీబీవీల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, ఎస్ఎస్ఏ ఉద్యోగులకు డిసెంబర్, జనవరి రెండు మాసాల వేతనాలు అందలేదు. నవంబర్ నెల వేతనాలను యూనిఫాం వస్త్ర అడ్వాన్స్‌ను ఆపి చెల్లించారు.
- సంగారెడ్డి, ఖమ్మం, రంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో పెన్షనర్లకు ఇంత వరకు పింఛన్లు అందలేదు. ఇదే అంశంపై అధికారులను ఆరా తీస్తే సోమవారం సాయంత్రం వేస్తామని చెప్పినప్పటికీ జమకాలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

