హైదరాబాద్, ఆట ప్రతినిధి: సికింద్రాబాద్ క్లబ్ జీఎంఆర్ స్పోర్ట్స్ యూత్ ఓపెన్ రెగట్టా ఆప్టిమిస్ట్ క్లాస్ టీమ్ రేసింగ్ విభాగంలో తృష్ణ సెయిలింగ్ క్లబ్ చాంపియన్గా నిలిచింది. హుస్సేన్ సాగర్లో గురువారం ఉత్కంఠగా సాగిన ఫైనల్ రేసులో కృష్ణ , అల్డ్రెయిన్ ఆంటోనీ, విరాట్, ఖైరుల్ అఫెండీతో కూడిన తృష్ణ క్లబ్ స్థానిక తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్-1 జట్టుపై పైచేయి సాధించింది.
ఎస్.కె. రమీజా భాను, మణి ఎన్, రవి బెన్నోలు , నరసింహతో కూడిన తెలంగాణ సెయిలింగ్-1, తృష్ణ సైలింగ్ క్లబ్ తుదిపోరులోతలో రేసు గెలవడంతో టైటిల్ విజేతను తేల్చేందుకు ఆఖరి నిర్ణయాత్మక రేసు నిర్వహించారు. ఇందులో అద్భుత ప్రతిభ కనబరిచిన తృష్ణ క్లబ్ విజయం సాధించింది.