కొలంబో: శ్రీలంక టూర్‌ను భారత అండర్-19 జట్టు ఘనవిజయంతో ముగించింది. గురువారం ముగిసిన రెండో యూత్ టెస్టులో యువ భారత్ 211 పరుగుల భారీ తేడాతో శ్రీలంక అండర్-19ను చిత్తు చేసింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో గెలుచుకుంది. భారత్ నిర్దేశించిన 472 పరుగుల ఛేదనలో ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 260కే ఆలౌట్ అయింది. ఆఖరి రోజు భారత విజయానికి ఆరు వికెట్లు కావాల్సి ఉండగా స్పిన్నర్ రోహిత్ యాదవ్ (4/49), సుభాష్ (3/27) రాణించడంతో ఈ టెస్టు టీమిండియా వశమైంది.