హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ విద్యాకమిషన్ నివేదికలో పలు అంశాలపై తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) అభ్యంతరం వ్యక్తంచేసింది. టీచర్లను అభద్రతకు గురిచేసే అంశాలను నివేదిక నుంచి తొలగించాలని కోరింది.
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి సోమవారం ప్రభుత్వ సలహాదారు కే కేశవరావును కలిసి వినతిపత్రం సమర్పించారు. టీచర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించడం, పదోన్నతులు నిలిపివేయడం, గ్రేడింగ్ల పేరుతో టీచర్లను విభజించాలని విద్యాకమిషన్ సిఫార్సు చేయడం సరికాదని వాపోయారు. ఈ అంశాలు తొలగించాలని కోరారు.