విద్యుదాఘాతంతో 4 ఏనుగులు మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుదాఘాతంతో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. భామిని మండలం కాట్రగడ-బి సమీపంలోని పంట పొలాల వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నది.
- ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో ఘటన
- చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడిలో ఇద్దరు మృతి
హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుదాఘాతంతో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. భామిని మండలం కాట్రగడ-బి సమీపంలోని పంట పొలాల వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నది. విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్కు తాకి ఏనుగులు మృతి చెందినట్టు స్థానికులు పేర్కొన్నారు. ఒడిశా నుంచి వచ్చిన ఆరు ఏనుగుల గుంపు కొంతకాలంగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్నది. ఆ గుంపులోని నాలుగు ఏనుగులు గురువారం రాత్రి విద్యుదాఘాతానికి గురై మృతి చెందగా.. మరో రెండు ఏనుగులు సమీపంలోని తువ్వకొండవైపు వెళ్లిపోయాయని స్థానికులు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లనూరు, సప్పానికుంటలో ఏనుగుల దాడిలో ఇద్దరు మృతిచెందారు. మల్లనూరులో ఉష అనే మహిళ రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా, సప్నానికుంటలో శివలింగం అనే రైతు పొలం నుంచి వస్తుండగా ఏనుగులు దాడి చేశాయి. దీంతో ఘటనాస్థలంలోనే ఇద్దరూ మృతి చెందారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

