హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు రంగంలో సంస్కరణల కోసం కేంద్ర బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు తీవ్ర హాని జరుగుతుందని డీవైఎఫ్ఐ రాష్ట్ర నేతలు అనగంటి వెంకటేశ్, డీజీ నరసింహారావు, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు బండారు రవికుమార్, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరామ్ నాయక్, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్టా నరసింహ, డిజిటల్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు సుంద ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం వారు హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 74 నుంచి 100 శాతానికి దేశీయ బీమా సంస్థలను బలహీనపర్చడమేనని విమర్శించారు.
ఆర్థిక సంసరణలను అమలు చేసే రాష్ట్రాలకే సహకరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ధ్వజమెత్తారు. అణు ఇంధన సంస్థలను పూర్తిగా ప్రైవేటీకరించడంతోపాటు ఖనిజ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు మోదీ సర్కారు బరితెగించిందని నిప్పులు చెరిగారు.