విద్యుత్తు ఉద్యోగుల పీఆర్సీపై చర్చలు
విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణపై ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. హైదరాబాద్ మింట్‌కంపౌండ్‌లోని తన కార్యాలయంలో విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి జేఏసీ నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు.
- జేఏసీ నేతలతో మంత్రి జగదీశ్‌రెడ్డి భేటీ
- నేడూ కొనసాగనున్న సంప్రదింపులు
హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణపై ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. హైదరాబాద్ మింట్‌కంపౌండ్‌లోని తన కార్యాలయంలో విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి జేఏసీ నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ (టీఈఈ), తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ (టీఎస్పీఈ) జేఏసీ నేతలతో మంత్రి వేర్వేరుగా సంప్రదింపులు జరిపారు. పీఆర్సీ సహా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అంశంపై చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగినట్టు నేతలు ప్రకటించారు. వేతన సవరణపై కొంత స్పష్టతరాగా, సోమవారం మళ్లీ చర్చలు జరుపుతామని ప్రభుత్వం జేఏసీ నేతలకు తెలిపింది.
చర్చల సారాంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలతో సోమవారం చర్చలు జరుపుతామని, జేఏసీ నేతలు అందుబాటులో ఉండాలని సూచించింది. యాజమాన్యం నుంచి టీఎస్ ట్రాన్స్‌కో జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, టీఎన్ఎన్పీడీసీఎల్ సీఎండీ ఏ గోపాల్‌రావు, టీఎస్ ట్రాన్స్‌కో, జెన్కో జేఎండీ శ్రీనివాస్‌రావు, టీఈఈ జేఏసీ నేతలు ఎన్ శివాజీ, కోడూరి ప్రకాశ్, పాపకంటి అంజయ్య, జాన్సన్, నాజర్ షరీఫ్, మాతంగి శ్రీనివాస్, రామేశ్వరయ్యశెట్టి, తుల్జారాంసింగ్, కరెంట్‌రావు, టీఎస్పీఈ జేఏసీ నేతలు సాయిబాబు, శ్రీధర్, రత్నాకర్‌రావు, బీసీరెడ్డి, వజీర్, అనిల్‌కుమార్, వెంకన్నగౌడ్, సుధాకర్‌రెడ్డి తదితరులు చర్చల్లో పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

