సంగారెడ్డి : జిల్లాలోని బొల్లారం టీజీఎస్పీడీసీఎల్లో అడిషనల్ ఏఈగా ( Additional AE ) పనిచేస్తున్న బి రామకృష్ణారెడ్డి ( Ramakrishna Reddy ) లంచం ( Bribe ) తీసుకుంటూ పట్టుబడ్డారు. గురువారం మధ్యాహ్నం విద్యుత్ శాఖ కార్యాలయంలో బాధితుడి నుంచి రూ.25 వేలు తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కారు.
ఈ నెల 12న ప్రమాదవాశాత్తు విద్యుత్ స్తంభాన్ని కారుతో ఢీ కొట్టడంతో స్తంభం మరమ్మత్తుకు గురైంది. ఈ విషయంలో తనపై చర్యలు తీసుకోవద్దని అడిషనల్ ఏఈని సంప్రదించగా అందుకు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. రామకృష్ణారెడ్డి పై కేసు నమోదు చేసి హైదరాబాద్ కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.