హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్ర చరిత్రలో విద్యుత్తు డిమాండ్ పతాకస్థాయికి చేరుకున్నది. గురువారం 4:39 గంటలకు 17,162 మెగావాట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదేరోజు రికార్డు అయిన అత్యధిక డిమాండ్ 13,557 మెగావాట్లు కాగా, 4 వేల మెగావాట్లు అత్యధికంగా నమోదవడం విశేషం. నిరుడు మార్చి 8న అత్యధిక విద్యుత్తు డిమాండ్ 15,623 మెగావాట్లు నమోదవగా, ఫిబ్రవరి 5న విద్యుత్తు సంస్థలు అధిగమించాయి. మార్చి ప్రారంభం నుంచి విద్యుత్తు డిమాండ్ 16 వేల మెగావాట్లకు మించి నమోదవుతున్నది. తాజాగా 17,162 మెగావాట్లుగా నమోదై ఈ నెల 18న నమోదైన గరిష్ఠ డిమాండ్ 16,976 మెగావాట్లను అధిగమించింది. 11, 017 మెగావాట్లుగా నమోదైంది.