హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): ఇంటర్, టెన్త్ పరీక్షలు ముగిసిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సర్పంచుల సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్చందర్తో కలిసి ఎలక్షన్ కమిషన్ సంయుక్త కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు.