హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఆదివారం హైదరాబాద్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర సమావేశంలో 2025-28 కాలానికి రాష్ట్ర అధ్యక్షుడిగా వొడ్నాల రాజశేఖర్(జగిత్యాల), ప్రధాన కార్యదర్శిగా తెల్కలపల్లి పెంటయ్య(యాదాద్రి భువనగిరి) ఎన్నికయ్యారు. జాతీయ విద్యావిధానం అమలుచేయాలని, పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏలను వెంటనే ప్రకటించాలని, ఉపాధ్యాయులు, విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.