Election Commission : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 30లోపు ఎలక్షన్లు నిర్వహించాలని హై కోర్టు(High Court) ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 28న పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితా సవరణ చేస్తామని ఈసీ తెలిపింది.
ఆగస్టు 29న జిల్లా స్థాయి పార్టీ నేతలతో, 30న మండల స్థాయి పార్టీ ప్రతినిధులతో భేటీ అవుతామని ఈసీ ప్రకటించింది. ఆగస్టు 28 నుంచి 30వ తేదీ వరకూ అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపింది. సెప్టెంబర్ 2న తుది జాబితా విడుదల చేస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది.
Telangana Panchayat Elections Update
SEC notifies schedule for Photo Electoral Rolls of Gram Panchayats:
• Draft rolls publication: 28 Aug 2025
• District-level party meet: 29 Aug 2025
• Mandal-level party meet: 30 Aug 2025
• Objections: 28–30 Aug 2025
• Disposal of… pic.twitter.com/z5j9inDDpl— Naveena (@TheNaveena) August 26, 2025