Panchayat Elections | హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది డాటాను సిద్ధం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎన్నికల సంఘం తాజాగా ఆదేశాలు జారీచేసింది. జిల్లా, రెవెన్యూ, డివిజన్, మండలాలు, పంచాయతీలతోపాటు వార్డుల సంఖ్య ఆధారంగా వివరాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్లను ఆదేశించింది.
దీంతో స్థానిక సంస్థల ఎన్నికల కోసం హడావుడి మొదలైంది. ఈ మేరకు త్వరలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
బెజ్జూర్, జూలై 15 : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలకు బీటీ రోడ్లు, వాగులపై వంతెనలు నిర్మిస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేస్తామని 12 గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
లేకపోతే తమ గ్రామాలకు ఎవరూ రాకూడదని తేల్చిచెప్పారు. 12 గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు మంగళవారం సోమిని గ్రామంలో సమావేశమై సమస్యలపై చర్చించారు.