Jungle | రీసెంట్గా శంబాల సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు టాలీవుడ్ యాక్టర్ ఆది సాయికుమార్ (Aadi Saikumar). ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఆది సాయికుమార్ ఇక మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఆడియెన్స్‌ను కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఆదిసాయి కుమార్ హీరోగా నటిస్తోన్న చిత్రం జంగిల్ (Jungle). వేదిక హీరోయిన్గా నటిస్తోంది. కార్తీక్ -విఘ్నేశ్ డైరెక్షన్లో హార్రర్ థ్రిల్లర్ జోనర్లో రాబోతున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని ఫ్రైడే పిక్చర్స్ బ్యానర్‌పై రాఘవ రెడ్డి తెలుగులో రిలీజ్ చేయనున్నారు.
జంగిల్ థ్రియాట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ సహా అన్ని రైట్స్‌ను ఫ్రైడే పిక్చర్స్ సొంతం చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆదిసాయికుమార్ ఇదివరకెన్నడూ కనిపించని డిఫరెంట్ రోల్లో కనిపించబోతున్నాడట. హార్రర్, సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ చిత్రంలో వేదిక పాత్ర హైలెట్‌గా ఉండబోతుందని.. త్వరలోనే జంగిల్ ఫస్ట్ లుక్, ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు.
Supritha | మా అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలనుంది … సుప్రిత ఎమోషనల్ కామెంట్స్ వైరల్