ECI | కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం
ECI | కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంపై బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈ అంశాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది.
ECI | హైదరాబాద్ : కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంపై బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈ అంశాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది.
ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ప్రకటనల జారీ ఎన్నికల నియమావళి ఉల్లంఘన అవుతుందని ఈసీ పేర్కొంది. మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ప్రకటనలు ఆపివేయాలని ఆదేశించింది. సంబంధిత శాఖ కార్యదర్శిపై చర్యలు ఎందుకు తీసుకోరాదో తెలపాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రకటనల కోసం కర్ణాటక ప్రభుత్వం తమ అనుమతి తీసుకోలేదని ఈసీ వెల్లడించింది. ప్రకటన కోసం కర్ణాటక ప్రభుత్వం కనీసం దరఖాస్తు చేయలేదని తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP
- BRS party
- congress party
- ECI
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

