Election Code | తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ ముగిసింది. దీంతో గత అక్టోబర్ తొమ్మిదో తేదీన అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది. తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల కోడ్ ఎత్తివేస్తున్నట్లు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ తొలగినట్లయింది.