Election Code | హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 80 రోజుల సుదీర్ఘ ఎన్నికల కోడ్ను ఎత్తివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఉపఎన్నిక కౌం టింగ్ కొనసాగుతున్నందున ఈ జిల్లాల పరిధిలో కోడ్ కొనసాగనుంది.
మార్చి 16న కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో ఆ రోజు నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో మే 13న నాలుగో విడతలో ఎన్నికలు ముగిసినా ఓట్ల లెక్కింపు, ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే వరకు కోడ్ అమల్లో ఉంది.