ఆశలు కూల్చిన ‘ఇందిరమ్మ’!
కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ నుంచి ఇల్లు వస్తుందన్న ఆశతో ఆ పేద మహిళ ఉన్న గూడును కూల్చుకున్నది. ఎదురుచూస్తూ తన కూతుళ్లు ఉండే కిరాయి ఇంటిలో ఉండసాగింది. కానీ, విధి మరో రూపంలో ఆ పేదరాలిని వెంటాడింది. ఆమె అనారోగ్యంతో మృతి చెందడంతో మృతదేహాన్ని కిరాయి ఇంటి య జమాని అనుమతించకుండా కాఠిన్యం చూపాడు. కన్నతల్లి మృతదేహాన్ని ఎక్కడ ఉంచాలో తెలియని దుస్థితి. చేసేది లేక చివరకు ఆమె కూల్చుకున్న ఇంటి స్థలమే దిక్కయింది.
- ఇల్లిస్తామనడంతో ఇల్లు కూల్చివేత
- కూతురి కిరాయి ఇంటికి తల్లి
- ఇందిరమ్మ ఇంటి కోసం ఎదురుచూసి తుదకు కన్నుమూసిన పేదరాలు
- ఇంటి ముందు మృతదేహాన్ని అనుమతించిన యాజమాని
- చేసేదేమీ లేక కూల్చిన స్థలంలోనే ఉంచి అంతిమ సంస్కారాలు
- ఖాళీ స్థలంలో నివాసం ఉండేదెలా అంటూ కూతుళ్ల ఆవేదన
శామీర్‌పేట, అక్టోబర్ 12 : కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ నుంచి ఇల్లు వస్తుందన్న ఆశతో ఆ పేద మహిళ ఉన్న గూడును కూల్చుకున్నది. ఎదురుచూస్తూ తన కూతుళ్లు ఉండే కిరాయి ఇంటిలో ఉండసాగింది. కానీ, విధి మరో రూపంలో ఆ పేదరాలిని వెంటాడింది. ఆమె అనారోగ్యంతో మృతి చెందడంతో మృతదేహాన్ని కిరాయి ఇంటి య జమాని అనుమతించకుండా కాఠిన్యం చూపాడు. కన్నతల్లి మృతదేహాన్ని ఎక్కడ ఉంచాలో తెలియని దుస్థితి. చేసేది లేక చివరకు ఆమె కూల్చుకున్న ఇంటి స్థలమే దిక్కయింది.
అక్కడే ఉంచి ఆ తల్లికి ఆమె కూతుళ్లు అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందిరమ్మ ఇల్లు వస్తుందన్న ఆశతో మొదలైన ప్రయాణం.. నిలువ నీడ కరువై కన్నతల్లి కడసారి వీడ్కోలు కూడా ఆరుబయటే నిర్వహించాల్సిన విషాదంగా మారింది. ఇది ఓ నిరుపేద కుటుంబానికి ఎదురైన దయనీయ పరిస్థితి. కాంగ్రెస్ సర్కార్ పథకాల అమలులో నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తున్నది. మేడ్చల్-మల్కాజిరిగి జిల్లా శామీర్‌పేట మం డల కేంద్రానికి చెందిన గండమళ్ల లక్ష్మి(84)కి 100 గజాల్లో పెంకుటిల్లు ఉండేది. ఆమె భర్త, కొడుకు గతంలో చనిపోగా, ఇద్దరు కూతుళ్లు రాజమణి, ఆండాలుకు వివాహాలు జరిపించించింది. ఇలాంటి స్థితిలో కూతుళ్లే లక్ష్మి ఆలనాపాలనా చూసుకోసాగారు.
ఇల్లు హామీతో పెంకుటిల్లు కూల్చివేత
శిథిలావస్థకు చేరుకున్న ఆ పెంకుటిల్లు స్థానంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ నాయకులు, అధికారులు హామీ ఇచ్చారు. వారిచ్చిన హామీతో రెండేండ్ల క్రితం ఉన్న ఇంటిని కూల్చివేసింది. అప్పటి నుంచి లక్ష్మి కిరాయి ఇంటిలో ఉంటూ, అధికారులు, కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరిగి విసిగి వేసారింది. కూల్చివేసిన ఇంటిని కూతుళ్ల పేరున మార్చాలని కొందరు నాయకులు సూచించడంతో నమ్మిన ఆ పేదరాలు.. రూ.60 వేలు అప్పు తెచ్చి తన ఇద్దరు కూతుళ్ల పేరున రిజిస్ట్రేషన్ చేయించింది. అయినా ఇల్లు మంజూరు కాలేదు. ఇందిరమ్మ ఇంటి కోసం ఎదురుచూసిన ఆ పేదరాలు సోమవారం తుదిశ్వాస విడిచింది. అంత్యక్రియలకు కిరాయి ఇంటి యజమానులు కాఠిన్యంతో నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక తమకున్న 100 గజాల ఖాళీ స్థలంలో తమ తల్లి అంత్యక్రియలకు ఆమె కూతుళ్లు, బంధువులు సిద్ధమయ్యారు. టెంట్ కిందే మృతదేహాన్ని ఉంచి కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు.
కాంగ్రెసోళ్ల మాటల నమ్మి రోడ్డు పడ్డాం
కాంగ్రెసోళ్ల మాటలు నమ్మి రోడ్డున పడ్డామని మృతురాలు లక్ష్మి కూతుళ్లు రాజమణి, ఆండాలు ఆవేదన వ్యక్తంచేశారు. తమ తల్లి అంత్యక్రియలకు నిలువనీడ లేకుండా అ య్యిందని, పెంకుటిల్లు ఉన్నా తమకు ఇబ్బందులు లేకుండా ఉండేవని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు కమిటీ సభ్యులు కూడా తమ వద్ద కు వచ్చి ఇల్లు ఇప్పిస్తామని చెప్పారని వారు తెలిపారు. కానీ, నిరుపేదలమైన తమకు అన్ని అర్హతలున్నా, ఇల్లు మంజూరు చేయలేదని, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? అంటూ వారు తీవ్ర ఆక్రోశం వెళ్లగక్కారు. కిరాయి ఇంటిలో అంత్యక్రియలు జరుపుకోవడానికి అంగీకరించడం లేదని, 10 రోజుల వరకు ఇంటికే రావొద్దని తేల్చి చెప్పారని ఆవేదన వ్యక్తంచేశారు. అంత్యక్రియలు పూర్తయ్యే 10 రోజుల వరకు ఖాళీ స్థలంలో, రోడ్డుపై ఎలా ఉండేదని వారు కన్నీంటి పర్యంతమయ్యారు. తమకు ఎదిగిన కూతుళ్లు ఉన్నారని, 10 రోజులు ఖాళీస్థలంలో గడిపేందుకు ఏదైనా ఆధారం చూపాలని వారు అధికారులను కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

