సంగారెడ్డి : ఆర్టీసీ బస్సును(RTC bus) లారీ ఢీకొట్డంతో పలువురు ప్రయాణికులు గాయప డ్డారు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని జహీరాబాద్ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జహీరాబాద్లో ఓ ఆర్టీసీ బస్సు అల్గోల్ చౌరస్తా దాటుతుండగా వెనకనుంచి వచ్చిన ఓ లారీ బస్సును బలంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి క్షతగాత్రులను జహీరాబాద్ ఏరియా హాస్పిటల్కు తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Revanth Reddy | సర్కారువారి అప్పు మరో 409 కోట్లు.. రూ.1,38,117 కోట్లకు చేరిన రేవంత్ సర్కార్ అప్పు
Industrial Park | అసైన్డ్ భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్.. తిమ్మాపూర్లో 567 ఎకరాల సేకరణకు చర్యలు