IAS Transfers | వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి బదిలీ.. మరో ఏడుగురు ఐఏఎస్‌లు కూడా
రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారులను (IAS Transfers) ప్రభుత్వం బదిలీ చేసింది. వాణిజ్య పన్ను శాఖ కమిషనర్ టీకే శ్రీదేవితోపాటు మరో ఏడుగురు ఐఏఎస్‌లను కూడా ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీచేశారు.
హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారులను (IAS Transfers) ప్రభుత్వం బదిలీ చేసింది. వాణిజ్య పన్ను శాఖ కమిషనర్ టీకే శ్రీదేవితోపాటు మరో ఏడుగురు ఐఏఎస్‌లను కూడా ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీచేశారు. టీకే శ్రీదేవిని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా నియమించారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు.
అదేవిధంగా రవాణా, ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజ్‌ను, పురపాలక శాఖ డిప్యూటీ సెక్రెటరీగా ప్రియాంకను నియమించారు. విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శి ఎస్.హరీశ్‌కు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. హాకా ఎండీగా చంద్రశేఖర్ రెడ్డిని, మార్క్‌ఫెడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డి బదిలీచేశారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

