ఖలీల్వాడీ ( నిజామాబాద్) : తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లుకు (SC classification) వ్యతిరేకంగా జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kisan reddy) దిష్టిబొమ్మలను దహనం ( Effigy burnt ) చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ 2024 సర్వే ప్రకారం కాకుండా 2011 ప్రకారం వర్గీకరణ చేయడం సమంజసం కాదన్నారు. ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు ఎడ్ల నాగరాజు,అంగరి ప్రదీప్, అలుక కిషన్, జిల్లా మాల మహానాడు అధ్యక్ష,కార్యదర్శులు ఆనంపల్లి ఎల్లయ్య, నాంది వినయ్ కుమార్,కోశాధికారి నీలగిరి రాజు, టీం చైర్మన్ ఉదయ్ కుమార్,కో చైర్మన్ దేవదాస్, స్వామిదాస్, జిల్లా నాయకులు గోపు ప్రభాకర్,బొడ్డు నర్సింగ్,అర్గుల సురేష్,బాలయ్య, నారాయణ, బొడ్డు లక్ష్మణ్,గంగాధర్, రామచందర్, దయానంద్, సాయన్న, సాయిలు పాల్గొన్నారు.