Ramoji Rao | హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను నానక్‌రామ్‌గూడలోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. కొంతకాలంగా రామోజీరావు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవలే స్టంట్ కూడా వేసినట్టు సమాచారం. అయితే శుక్రవారం రాత్రి ఒక్కసారిగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం రామోజీరావు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నట్టు తెలిసింది.