Edupayala Jatara | పాపన్నపేట, ఫిబ్రవరి 25 : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లిలోని ఏడుపాయల జాతరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం మంత్రి దామోదర రాజనర్సింహ అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించి జాతరను ప్రారంభిస్తారు. జాతరకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి 15లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. శివరాత్రి సందర్భంగా భక్తులు మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసి దుర్గమ్మను దర్శించుకొని శివదీక్షలు చేపడతారు. గురువారం ఎడ్ల బండ్లు తిరగడం, శుక్రవారం రథోత్సవం జరుగుతుంది.