హైదరాబాద్, జనవరి 6(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విద్యా ప్రమాణాలకు విఘా తం కలిగిస్తున్న సమస్యలను వెంటనే పరిషరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి డిమాండ్చేశారు. మంగళవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ..1,030 గురుకుల పాఠశాలల్లో 650కి పైగా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, ప్రభుత్వం 12 ఏండ్లుగా రూ.3,500 కోట్లు అద్దెరూపంలో చెల్లించిందని, ఆ మొత్తంతో శాశ్వత భవనాలు నిర్మించవచ్చని పేర్కొన్నారు. అద్దె భవనాల్లో అరకొర వసతులతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నిబంధనల ప్రకారం 10 మంది విద్యార్థులకు ఒక బాత్రూం ఉండాలని, కానీ ఒకో బాత్రూమ్ను 30 మంది వాడుకోవాల్సిన దుస్థితి నెలకొన్నదని సభ దృష్టికి తెచ్చారు.
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ఆర్భాటంగా కాకుండా, అన్ని వసతులు, పూర్తిస్థాయి ప్రొఫెసర్ల నియామకంతో ప్రారంభించాలని శాసనమండలి సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. మంగళవారం మండలిలో ఎర్త్ సైన్స్ వర్సిటీకి చట్టబద్ధత కల్పించే తెలంగాణ యూనివర్సిటీల చట్టసవరణ బిల్లును శాసనమండలిలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రవేశపెట్టారు. చర్చలో సభ్యులు చింతపండు నవీన్, నెల్లికంటి సత్యం, శ్రీపాల్రెడ్డి, అంజిరెడ్డి, వెంకట్, కొమురయ్య పాల్గొన్నారు.
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్గా కవ్వంపల్లి సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపినట్టు ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు.