చదువులు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి : మంత్రి నిరంజన్‌రెడ్డి
విద్యార్థులు ఎంత గొప్ప చదువులు చదివినా అవి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.
వనపర్తి : విద్యార్థులు ఎంత గొప్ప చదువులు చదివినా అవి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. జాతీయ సేవా పథకం కార్యక్రమంలో భాగంగా వనపర్తిలో ప్రత్యేక పశు వైద్య శిబిరాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవుడు సృష్టిలో మేధోసంపతి గల జీవి అని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం తరువాత పశుపోషణకు ప్రాముఖ్యత ఇస్తుందని వెల్లడించారు. మానవ సమాజం జీవరాశుల చుట్టూ అనుసంధానమై ఉందని మానవులకు అవసరమైన జీవులను పెంచాలని సూచించారు. మానవుల ఆహార మార్పులలో పశువులు చాలా అవసరమని అన్నారు.
పశుపోషణ ఉత్పత్తి పెంపొందించేందుకు కృషి చేయాలని సూచించారు. భవిష్యత్‌లో పశువైద్య ఆవశ్యకత ఎక్కువగా ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా, పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ రవీందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

