హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కార్యదర్శి సురేంద్రమోహన్ను బదిలీ చేస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని పేర్కొన్నది. ఆయన స్థానంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు అదనపు బాధ్యతలు అప్పజెప్పింది.