కవాడిగూడ, ఫిబ్రవరి 22: 40వేల లోపు ఫీజులు తీసుకొనే పాఠశాలలను బడ్జెట్ పాఠశాలలుగా గుర్తించాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయనతో పాటు ట్రస్మా ప్రతినిధులు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిని హైదరాబాద్‌లో కలిసి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ పాఠశాలల్లో చాలా మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుతున్నారని, వీటికి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలని కోరారు. బడ్జెట్ పాఠశాలలకు బిల్డింగ్, ప్రాపర్టీ ట్యాక్స్‌ను డొమెస్టిక్ ట్యాక్స్‌గా మార్చాలని కోరారు. పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి హెల్త్ కార్డులు, డబుల్ బెడ్రూంలు ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, సానుకూలమైన నిర్ణయం తీసుకొంటామని మంత్రి హామీ ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు. మంత్రిని కలిసి వారిలో ట్రస్మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, మేడ్చ ల్ అధ్యక్షుడు రామేశ్వర్‌రెడ్డి, అసోసియేట్ ప్రసిడెంట్ టీ బుచ్చిరెడ్డి, ఆంజనేయులు, సీహెచ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.