June 20 | జూన్ 20.. ఒకేరోజు 10 వేల లైబ్రరీలు 1,600 డిజిటల్ క్లాస్రూమ్స్ ఓపెన్
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవా ల్లో భాగంగా ఒకేరో జు 10 వేల గ్రంథాలయాలు, 1,600 డిజిటల్ తరగతి గదులను ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా జూన్ 20న నిర్వహించే విద్యా దినోత్సవం రోజున దీనికోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
- ఆధునీకరించిన ప్రభుత్వ బడుల ప్రారంభానికీ అధికారుల ఏర్పాట్లు
- జూన్ 20న వివిధ కార్యక్రమాలు
- విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
June 20 | హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవా ల్లో భాగంగా ఒకేరో జు 10 వేల గ్రంథాలయాలు, 1,600 డిజిటల్ తరగతి గదులను ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా జూన్ 20న నిర్వహించే విద్యా దినోత్సవం రోజున దీనికోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన చాంబర్లో బుధవారం విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉత్సవాలు జరిగే 21 రోజులపాటు పదేండ్లలో విద్యారంగంలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అన్ని విద్యాసంస్థల్లో సభలు, సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని వివరించాలని సూచించారు. ‘మన ఊరు- మన బడి, మన బస్తీ -మన బడి కింద ఆధునీకరించిన ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించేందుకు కూడా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మొదటి విడతలో రూ.3,497.62 కోట్లు వెచ్చించి, 9,123 సూళ్లను అభివృద్ధి చేసినట్టు వివరించారు. సమావేశంలో పాఠశాల విద్యా సంచాలకురాలు శ్రీదేవసేన, అధికారులు రమేశ్, జయప్రదాబాయి, లక్ష్మారెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
దశాబ్ది ఉత్సవాల్లో విద్యార్థుల కోసం..
- రూ.190 కోట్లతో 30 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందించనున్నారు.
- రూ.60 కోట్లతో 6 నుంచి 10వ తరగతి చదివే 12.39లక్షలమంది విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందించనున్నారు.
- 2 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు రూ.10 కోట్ల విలువైన పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేయనున్నారు.
- రూ.150 కోట్లతో 26 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండేసి జతల చొప్పున యూనిఫామ్ అందించనున్నారు.
- వీటన్నింటినీ పాఠశాలల పున: ప్రారంభం నాటికి విద్యార్థులకు అందజేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

