హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): విద్యతోనే సమాజంలో ముందడుగు సాధ్యమని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం అన్నారు. సచివాలయంలో శుక్రవారం ఆరోగ్యమిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పదోతరగతి విద్యార్థులకు మూడు నెలల పాటు నిర్వహించే ప్రేరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
శాస్త్రీయ ప్రణాళిక, పునశ్చరణతో పరీక్షల్లో విజయం సాధించవచ్చని తెలిపారు. ప్రేరణ వివరాలకు 99893 10141 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్ సూచించారు.