హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): పదో తరగతి పరీక్షల హాల్‌టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆదివారం ప్రకటనలో వెల్లడించారు.
లేదంటే సంబంధింత పాఠశాలల నుంచి పొందవచ్చని సూచించారు. ఇతర వివరాల కోసం 040-23230942 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.